calender_icon.png 10 September, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ పై చర్యలేవి

10-09-2025 08:22:37 AM

నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసు ఉన్నత అధికారులు

డివి నుండి మాకు ప్రాణహాని ఉంది

న్యాయం కోసం హైకోర్టు కు వెళ్తాం

ఇల్లందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు (డివి) పై, నిందితులకు సహకరిస్తున్న పోలీసు ఉన్నత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇటీవల ఆత్మహత చేసుకున్న గడపర్తి శ్రీనివాస్ అన్నయ్య గడపర్తి వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం స్తానిక పాత బస్టాండ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 6న ఆత్మహత్య చేసుకున్న తన తమ్ముడు గడపర్తి శ్రీనివాస్ కు, ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ కు గత కొన్ని సంవత్సరాల నుండి సాన్నిహిత్యం ఉందని ఆ సన్నిహిత్యంతో తన తమ్ముడు డివి ని నమ్మి దాదాపు కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగాయని అన్నారు. లావాదేవీలకు సంబంధించి ఈనెల 5న ఖమ్మంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ నిర్వహించగా డివి తన తమ్ముడు గడపర్తి శ్రీనివాస్ ను లావాదేవీలకు సంబంధించి అవమాన పరిచేవిధంగా మాట్లాడారని అన్నారు.

ఆర్థికంగా డివి కి సహాయం చేస్తే అవమాన పరిచే విధంగా డివి మాటాడటంతో అవమానాన్ని జీర్ణించుకోలేని తన తమ్ముడు గడపర్తి శ్రీనివాస్ మరుసటి రోజు ఈనెల 6న  ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మొట్లగూడెం గ్రామంలోని తన పొలంలో పురుగుల మందు తాగి చనిపోయి ఉన్నాడని అన్నారు. నా తమ్ముడిది హత్య ఆత్మహత్య అనే గందరగోళంలో తమ కుటుంబ సభ్యులు ఉన్నారని అన్నారు. అదే రోజు ఉదయం తన తమ్ముడు గడపర్తి శ్రీనివాస్ మృతుదేహంను తీసుకొని డివి ఇంటివద్ద నిరసన చేపడితే ఇల్లందు డీఎస్పీ, ఇల్లందు సిఐ, కారేపల్లి సిఐ, ఎస్సైలు మరి కొంతమంది పోలీసులను డివిని కలవడానికి మాకు అనుమతి ఇవ్వాలని కోరగా డీఎస్పీ మమ్మల్ని బలవంతంగా చెదరగొట్టి చట్టంలోని వివిధ నిబంధన కింద తిరిగి మాపై కేసు నమోదు చేయాలని ఇల్లందు సీఐని ఆదేశించారన్నారు.

మా ఫిర్యాదును తీసుకోవాలని డిఎస్పీని అభ్యర్థించినప్పుడు నిరాకరించి కారేపల్లి అధికార పరిధిలో మృతదేహం కనుగొనబడినందున ఫిర్యాదు చేయడానికి కారేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళమని మమ్ములను కోరాడు. తాము సిఐ, డీఎస్పీ బాధ్యత వహించి ఆన్లైన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేదా కారేపల్లి సిఐకి కేసు నమోదు చేసి నిందితుడు డివిని పోలీసు కస్టడీలోకి తీసుకోవాల్సింది పోయి నిందితుడు డివి బాధితుల ముందు ఉన్న మా ఫిర్యాదును స్వీకరించకపోగా మమ్ములను చెదరగొట్టి కారేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయమన్నారని అన్నారు. తాము ఇల్లందు నుంచి కారేపల్లి వెళ్లి ఫిర్యాదు చేసే వరకు మధ్యాహ్నం 2గంటలు వరకు ఫిర్యాదు నమోదు చేయలేకపోయామన్నారు. ఇంత తీవ్రమైన కేసులో పోలీసు ఉన్నతాధికారులు డివిని కేసు నుండి తప్పించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు అర్థమవుతుందని తక్షణమే పోలీసు ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో న్యాయం కోసం హైకోర్టు వరకు వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు.