calender_icon.png 10 September, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్‌లో ‘జెన్ జెడ్’.. నిప్పుల కోలాటం

10-09-2025 01:30:02 AM

మంటల్లో ఖాట్మాండు

-మళ్లీ రాజకీయ సంక్షోభం ప్రధాని ఓలీ రాజీనామా అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ కూడా..

-పార్లమెంట్, సుప్రీంకోర్టు, పలు పార్టీ ఆఫీసులకు నిప్పు పలువురు మంత్రుల ఆస్తులు ధ్వంసం.. 

-ఇద్దరు మంత్రులపై దాడిమాజీ ప్రధాని ఝూలానాథ్ ఖనాల్ ఇల్లు దగ్ధం..

-మంటల్లో ఆయన సతీమణి మృతి

-మంత్రులు, వీఐపీలు హెలిక్యాప్టర్‌లలో ఆర్మీ బ్యారక్స్‌కు దుబాయ్‌కు వెళ్లేందుకు ఓలీ సన్నాహాలు?

-నేపాల్‌కు వెళ్లొద్దు.. అక్కడి భారతీయులు వీధుల్లోకి రావొద్దు: భారత విదేశాంగశాఖ

రెండోరోజూ కొనసాగిన ‘జెన్‌జెడ్’ నిరసనలు 

పార్లమెంట్, సుప్రీంకోర్టు, పలు పార్టీ అఫీసులకు నిప్పు

-పలువురు మంత్రుల ఆస్తులు ధ్వంసం.. ఇద్దరు మంత్రులపై దాడి

-మాజీ ప్రధాని ఝూలానాథ్ ఖనాల్ ఇల్లు దగ్ధం.. మంటల్లో ఆయన సతీమణి మృతి

-మంత్రులు, వీఐపీలను ఆర్మీ బ్యారక్స్‌కు తరలిస్తున్న సైన్యం

-ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఓలీ.. వెనువెంటనే అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ కూడా..

-దుబాయ్‌కు వెళ్లేందుకు ఓలీ సన్నాహాలు?

-భారతీయులునేపాల్‌కు వెళ్లొద్దు:  భారత విదేశాంగశాఖ

ఖాట్మాండు, సెప్టెంబర్ 9: నేపాల్ రాజధాని ఖాట్మాండు రెండోరోజు మంగళవా రమూ ‘జెన్‌జెడ్’ నిరసనలతో అట్టుడుకింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతి, 26 సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధానికి వ్యతిరేకంగా యువత కదంతొక్కింది. రాజధాని ఖాట్మాండులోని పార్లమెంట్, సుప్రీం కోర్టు, అన్ని పార్టీల ప్రధాన కార్యాలయాల్లోకి దూసుకెళ్లి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

నేపాల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు దాదా పు అన్ని పార్టీల కార్యాలయాలను తగులబెట్టారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసానికి నిప్పుపెట్టారు. ఓలీ ఇంటిని ముట్టడించేందుకు నిరసనకారులు యత్నించగా పోలీ సులు వారిని అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులను కట్టడి చేసేందుకు పోలీసులు ఒకద శలో కాల్పులు జరపాల్సి వచ్చింది.

పోలీసుల కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ నివాసం, కమ్యూనికేషన్ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ నివాసం, ఇంధనశాఖ మంత్రి దీపక్ ఖడ్కా, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నివాసానికి నిప్పుపెట్టారు. ఇళ్లలోని ఫర్నీచర్‌తో పాటు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. సైన్యం దేశానికి చెందిన ఎంతోమంది వీఐపీలను ఖాట్మాండులోని సైనిక బ్యారక్స్‌లోకి తరలించింది. మంత్రులను, వారి కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నది.

ప్రధాని, అధ్యక్షుల రాజీనామా

నిరసనలు తారస్థాయికి చేరిన నేపథ్యం లో వెంటనే ప్రధాని పదవికి రాజీనా మా చేయాలని కేపీ శర్మ ఓలీకి సైన్యం సూచించింది. దీంతో ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో పాలనా పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్తుందనే చర్చ ప్రస్తుతం అంతర్జాతీయంగా నడుస్తున్నది.

దేశవ్యాప్తంగా ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో తనను సురక్షిత ప్రాం తానికి వెళ్లేందుకు సాయం చేయాలని కేపీ శర్మ ఓలీ సైన్యాన్ని కోరినట్లు తెలిసింది. ఎలాగైనా తాను నేపాల్‌ను వీడి ఓలీ దుబాయ్ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిసింది. ఈమేరకు హిమాలయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్పెషల్ ఫ్లుటైను సిద్ధం చేసుకు న్నారని సమాచారం. మరోవైపు ప్రధాని రాజీనామాను ఆమోదించిన కొంతసేపటికే, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు.

అఖిలపక్ష సమావేశానికి పిలుపు..

పరిస్థితుల నేపథ్యంలో ఓలీ అఖిల పక్ష సమావేశానికి కేపీ శర్మ ఓలీ పిలుపునిచ్చా రు. అస్థిర పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అన్ని పార్టీలతో చర్చలు జరుపు తున్నామని ఓలీ వెల్లడించారు.

మంత్రులపై దాడులు..

ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ ఇంట్లోకి వెళ్లి ఆందోళనకారులు ఆయనపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఆయ న్ను వీధుల వెంబడి పరుగులు పెట్టించారు. అలాగే విదేశాంగశాఖ మంత్రి అర్జు రాణా దేవుబా, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైనా ఆందోళనకారులు దాడులు చేశారు. మాజీ ఉప ప్రధాని రఘువీర్ మహాసేత్ నివాసంపై రాళ్లు రువ్వారు. సోమవారం తన పదవికి రాజీనామ చేసిన హోం మంత్రి రమేశ్ లేఖక్ నివాసాన్ని ముట్టడించారు. ఆయనకు చెందిన  ఆస్తులకు నిప్పుపెట్టారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా ఇంటిని ముట్టడించారు.

కొనసాగుతున్న రాజీనామాల పర్వం..

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మంత్రుల రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. సోమవారం హోమంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి, తాగునీటి సరఫరా మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు దేశ్యాప్తంగా పలువు రు ఎంపీలు సైతం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

విమాన సేవలు రద్దు..

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి యంత్రాంగం త్రిభువన్ అంతర్జాతీయ వి మానాశ్రయాన్ని మూసివేసింది. అన్ని రకాల విమాన సేవలను రద్దు చేసింది. విమానాశ్రయం వద్ద భారీగా సైనికులు మోహరిం చారు. అలాగే భారత ప్రభుత్వం కూడా ఢిల్లీ నుంచి ఖాట్మాండు వెళ్లే అనేక విమాన సర్వీసులను రద్దుచేసింది.

సంయమనం పాటించండి: ఐరాస

నేపాల్ పౌరులు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటన విడుదల చేసింది. హింసకు దూరంగా ఉండి ప్రాథమి క హక్కులను కాపాడుకోవాలని సూచించింది.

బీహార్ సరిహద్దులో హైఅలర్ట్..

నేపాల్‌లో ఉద్రిక్తల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ సరిహ ద్దు నుంచి రాకపోకలను నిలిపివేసి హైఅలర్ట్ ప్రకటించింది. 

నేపాల్‌కు వెళ్లొద్దు: భారత విదేశాంగశాఖ 

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతీయులెవరూ అక్కడికి వెళ్లొద్దని మంగళ వారం భారత విదేశాంగశాఖ  ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులు ఆవాసాల నుంచి బయటకు రావొద్దని సూచించింది. సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని పేర్కొంది. అవసరమైతే ఖాట్మాండులోని భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించింది.

మాజీ ప్రధాని సతీమణి మృతి

ఆందోళనకారులు ఖాట్మాండులోని మాజీ ప్రధాని ఝూలానాథ్ ఖనాల్ నివాసానికి నిప్పంటించారు. మంటల్లో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రాకర్ చిక్కుకున్నారు. సిబ్బం ది ఆమెను మంటల్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. తీవ్రగాయాల పాలైన ఆమెను సిబ్బందిబయటకు తీసుకువచ్చి కీర్తిపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా రాజ్యలక్ష్మి మృతిచెందారు.

రాయబార కార్యాలయంలో తెలుగు పౌరులు

ఏపీకి చెందిన సుమారు 30 మంది పౌరులు నేపాల్‌లోని ఖా ట్మాండులో చిక్కుకున్నారు. యం త్రాంగం వారిని భారత రాయబార కార్యాలయానికి తరలించారు. వారి క్షేమ సమచారం తెలుసుకునేందుకు 98183 95787 (సురేశ్ నోడల్ ఆఫీసర్)కు కాల్ చేయవచ్చని ఏపీ భవన్ కమిషనర్ డాక్టర్ శ్రీకాంత్ సూచించారు.

బాలెన్ షాపై యువత ఆశలు

బాలెన్ షా అనే ర్యాపర్.. నేపాల్ రాజకీయాల్లో అతనో సంచలనం. అతని పాటలంటే యువతకు వెర్రి. నల్ల రంగు బ్లేజర్, జీన్ ప్యాంట్, నళ్లటి కళ్లద్దాలు అతడికి ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ర్యాప్ బాణీల్లో రాజకీయ నేతలను విమర్శిస్తూ పాడిన పాటలు అక్కడి యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బీదల కష్టాలు, దేశంలో పేరుకుపోయిన అవినీతి, మలినమైన రాజకీయాలపై యువకుడు పాటల అస్త్రాలను సంధించేవాడు.

2022లో రాజకీయాల్లోకి ప్రవేశించిన యువకుడు ఖాట్మాండు మేయర్‌గా కొనసాగుతున్నాడు. బాలెన్ షాను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది వ్యాపారులు, కళాకారులు, ఇంజినీర్లు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ యువకుడు తాజాగా ఆ దేశ యువతతో కలిసి జెన్ జెడ్ విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఓలీ ప్రభుత్వ అవినీతి, సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతను కూడగడుతున్నాడు. దీంతో బాలన్ షానే దేశ ప్రధాని కావాలని అక్కడి పౌరులు కోరుకుంటున్నారు. షా నాయకత్వంలో దేశం సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు.

ఎవరీ సుడాన్ గురుంగ్?

నేపాల్‌లో ఆందోళనలకు ‘హామీ నేపాల్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుడాన్ గురుంగ్ సారథ్యం వహిస్తున్నాడు. ఇన్‌స్టా గ్రామ్‌ను అస్త్రంగా  మలుచుకుని కొంత కాలం నుంచి ఓలీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాడు. 2015లో నేపాల్‌లో సంభవించిన భూంకంపం కారణంగా గురుంగ్ తన బిడ్డను పోగొట్టుకున్నాడు.

అప్పటి నుంచి గురుంగ్  సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైనికుడిలా పనిచేస్తూ, బాధితుల పక్షాన నిలుస్తున్నాడు. 2018 నుంచి యువతకు సంబంధించిన సమస్యలపై పోరాడుతున్నాడు. దీంతో అక్కడి యువత గురుంగ్ నాయకత్వంపైనా నమ్మకం పెంచుకుంటున్నారు.