10-09-2025 08:19:52 AM
డబ్బులు ఎర వేసి.. నగదుతో పరార్.
కల్వకుర్తి : బ్యాంకులో బంగారు తనఖా పెట్టి డబ్బులు తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు డబ్బులు ఎర చూపి బైక్ లో ఉన్న నగదును తీసుకొని పరారీ అయిన సంఘటన మంగళవారం కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది.. పోలీసుల వివరాల ప్రకారం.. వంగూరు మండలం ఉల్పరకు చెందిన రెడ్డమోని రాము ఎస్బిఐ బ్యాంక్ లో బంగారం కుదవపెట్టి రూ,2,79,000లు తీసుకొని ఇంటికి వెళ్తూ పెట్రోల్ పోసుకొనుటకు బంకుకు వెళ్లాడు. మార్గమధ్యలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ముందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్ పై వెనకాల వస్తూ డబ్బులు క్రింద పడినవి మీ డబ్బులేనా అని ఆయనతో అన్నారు. దీంతో బైక్ ఆపి దిగి చూడగా ఒక వ్యక్తి బైక్ కవర్ లో ఉన్న డబ్బును తీసుకొని పరారీ అయినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు.