calender_icon.png 10 September, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటనతో మాజీ ఎమ్మెల్యే ముందస్తు హౌస్ అరెస్ట్

05-09-2025 12:21:42 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను హైదరాబాద్ లో పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తారని అరెస్టులు చేశారని మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ ఆరోపించారు.

ప్రజాస్వామ్య రాజ్యంలో ముందస్తు అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాకుండా పోలీసుల రాజ్యం కొనసాగుతుందని ఆయన అన్నారు. అక్రమ అరెస్టులను ఖండించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షం వరదల వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లిందని భారీ ప్రత్యేక ప్యాకేజీనీ  ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు.