18-10-2025 10:28:28 AM
జిల్లాల్లో కర్ఫ్యూను తలస్తున్న బీసీ సంఘాల బంద్ పిలుపు
జిల్లా వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో(Peddapalli district) బీసీ సంఘాల బంద్ కర్ఫ్యూను తలపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లాలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. బస్సులు రాకపోవడంతో, ప్రయాణికులు లేక పెద్దపల్లి, గోదావరిఖని, మంథని ఆర్టీసీ బస్టాండ్ లు వెలవెల బోతున్నాయి. బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీ లతో పాటు అన్ని పార్టీలు బంద్(BC Bandh)కు మద్దతు ఇవ్వడంతో జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పార్టీలకతీతంగా రోడ్లపైకి వచ్చి అందరూ బంద్ పాటించాల్సిందిగా వ్యాపారస్తులకు పాఠశాలలకు తెలుపటంతో ముందస్తుగానే పిలుపునివ్వడంతో పోలీసుల ప్రహార మధ్య జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి డిసిపి కర్ణాకర్ ఆదేశాలతో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్ లు కనుసైగల్లో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించి ప్రశాంతంగా బంద్ జరిగేలా చూస్తున్నారు.