18-10-2025 11:33:05 AM
బీసీ బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ,విజయక్రాంతి: బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్(Telangana Bandh)కు మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు శనివారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్(Devarakonda MLA Nenavath Balu Naik) పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూబీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ,బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని వారు అన్నారు.
రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎనలేని కృషి చేస్తున్నారు.బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, నియోజక వర్గ ముఖ్య నాయకులు,బీసీ సంఘం,వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.