calender_icon.png 18 October, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్ డివిజన్ లో కొనసాగుతున్న బీసీ బంద్

18-10-2025 10:39:02 AM

హుజురాబాద్,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఇచ్చిన రాష్ట్ర బంద్(BC bandh) కరీంనగర్ జిల్లా  హుజూరాబాద్ డివిజన్లో విశేష స్పందన లభించింది. బంద్ పిలుపు విజయవంతమైంది. శనివారం హుజురాబాద్ పట్టణంతోపాటు, హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కేశవపట్నం, సైదాపూర్ మండలాల్లో శనివారం ఉదయం నుంచే బీసీ నాయకులు రంగంలోకి దిగారు. ప్రధానంగా హుజురాబాద్ ఆర్టీసీ  హుజురాబాద్డిపోను లక్ష్యంగా చేసుకున్నారు బీసీ నాయకులు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డిపో ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. దీంతో బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీసీల రిజర్వేషన్ల డిమాండ్ను తక్షణమే నెరవేర్చాలని నినదించారు. డిపో వద్ద నిరసన అనంతరం బీసీ నాయకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

"బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి", "సామాజిక న్యాయం సాధించే వరకు పోరాటం ఆగదు" అంటూ నినాదాలతో పట్టణ వీధుల్లో హోరెత్తించారు. బంద్.. ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు! బీసీ సంఘాల పిలుపునకు మద్దతుగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలన్నీ మూసివేసి బంద్లో పాలుపంచుకున్నాయి. బీసీ నాయకుల నిరసన, బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిపో వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిపో వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టడంతో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు. బీసీ రిజర్వేషన్ల డిమాండ్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. మొత్తం మీద, బీసీ రిజర్వేషన్ల కోసం హుజూరాబాద్ డివిజన్లో జరిగిన ఈ బంద్ వివిజయవంతమైంది. బీసీల ఐక్యత, పట్టుదల ఈ నిరసనలో స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీసీ సంఘం నాయకులు, ప్రజాసంఘాల నాయకుల తో పాటు తదితరులు పాల్గొన్నారు.