calender_icon.png 18 October, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలికలపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్

18-10-2025 10:46:13 AM

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్‌ పోలీస్ స్టేషన్(Saidabad Police Station) పరిధిలో ఇద్దరు తోబుట్టువులు సహా ముగ్గురు మైనర్ బాలికలపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ బాలికలు తమ ఇంటి బయట ఆడుకుంటుండగా, నిందితుడు గమనించి వారిని తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో జరిగిన ఘటనపై బాధితులు ఎవరికి చెప్పలేదు. తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పిల్లలు పాఠశాలలో తమ క్లాస్‌మేట్స్‌తో చర్చించారు. దీంతో విషయం కాస్త బయటపడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న సైదాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.