calender_icon.png 18 October, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బంద్ సక్సెస్

18-10-2025 10:50:20 AM

స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపారస్తులు 

డిపో కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు 

బంద్ ను పర్యవేక్షిస్తున్న బీసీ జేఏసీ, పలు రాజకీయ పార్టీల నాయకులు 

బందు పిలుపుతో పోలీసులు అలర్ట్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని బీసీ జేఏసీ(BC JAC) ఇచ్చిన పిలుపుమేరకు కుమురం భీం ఆసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లా వ్యాప్తంగా బంద్(Bandh) ప్రశాంతంగా జరుగుతుంది.వ్యాపార సంస్థల యజమాన్యాలు బందులో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి.దీపావళి పండుగ నేపథ్యంలో బీసీ బందు పిలుపు ఇచ్చినప్పటికీ వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొనడం హర్షించ విషయం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో శనివారం వారసంత కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ పనులపై ఇక్కడికి వచ్చి నిత్యావసర సరుకులు, పలు సామాగ్రిని కొనుగోలు చేస్తుంటారు.

బంద్ ఉండడంతో ప్రజలు కొంత ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. బంద్(Telangana BC Bandh) ను బీసీ జేఏసీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.బీసీ జేఏసీ చైర్మన్ రూప్ నాథ్ రమేష్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్,మాజీ ఎంపీపీ బొమ్మన బాలేశ్వర్ గౌడ్,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు,బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బుర్సా పోచయ్య,పొన్నాల నారాయణ,కుల సంఘాల నాయకులు ఆంజనేయులు, శ్రీకాంత్, జక్కయ్య, లింగయ్య, గిరి, మంగ తదితరులు పాల్గొన్నారు.