calender_icon.png 18 October, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బంద్ విజయవంతం

18-10-2025 10:33:21 AM

కదలని బస్సులు

కరీంనగర్, (విజయక్రాంతి): తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు(BC bandh)  శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌'కు అన్ని వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. పార్టీలకు, సంఘాలకు అతీతంగా కరీంనగర్(Karimnagar joint district) ఉమ్మడి జిల్లాలో బీసీ నాయకులు బంద్ లో పాల్గొన్నారు. ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల పరిధిలో 900 బస్సులు కదలలేదు. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, , సిపిఐతో పాటు పలు పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో బంద్ విజయవంతంగా కొనసాగింది. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ వేములవాడలో బంద్ లో పాల్గొన్నారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి. ప్రైవేట్ , ప్రభుత్వ  విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ లో పాల్గొన్నాయి. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.