calender_icon.png 18 October, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు రాజ్యాధికారం రావాలి: ఎంపీ ఈటల రాజేందర్

18-10-2025 11:46:53 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల బంద్(Telangana BC bandh) కొనసాగుతోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు(BC Reservations) అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీసీ బంద్ కు వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి. అత్యవసర సర్వీసులకు బంద్ నుంచి మినహాయించారు.  జేబీఎస్(Jubilee Bus Station) దగ్గర బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... తమిళనాడు తరహాలోనే తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభల్లోనూ, మంత్రివర్గాల్లోనూ బీసీలకు వాటా కావాలని తెలిపారు.

బీసీలకు రాజ్యాధికారం రావాలని ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడకుండా ప్రక్రియ చేపట్టాలని హెచ్చరించారు. పద్ధతి ప్రకారం చేయకుండా కేంద్రం సహకరించడం లేదంటే ఎలా? అని ఈటల ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ నుంచి సీఎం అభ్యర్థి ఉంటారని ఈటల పేర్కొన్నారు.  బీసీ బంద్‌కు బీజేపీ మద్దతు ఇచ్చిందన్న ఈటల రాజేందర్ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో(Narendra Modi Government) 27 శాతం బీసీ మంత్రులు ఉన్నారని వివరించారు. రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి.. కాబట్టే బీసీలు రోడ్డెక్కారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఎలా ఉవ్వెత్తున లేచిందో బీసీలకు అన్యాయం జరిగితే అదే తరహా బీసీ ఉద్యమం(BC Movement) జరుగుతోందని ఎంపీ ఈటల రాజేందర్‌ తేల్చిచెప్పారు. అటు తెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీ బంద్ కు బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు ఇచ్చారు.