18-10-2025 12:21:11 AM
పెద్దపల్లి లో మీడియా సమావేశంలో టీఆర్ పి జిల్లా ఇన్చార్జి గుండవేన స్వామి
పెద్దపల్లి, అక్టోబర్ 17(విజయ క్రాంతి); స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చిన రాష్ట్ర బీసీ బంద్ ను జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండవేన స్వామి శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు.
తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా జిల్లాలో బీసీ సంఘాలు, మేధావులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీల సత్తాను చాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కాసిపేట ఉదయ్, నాయకులు అడ్డూరి గంగారం, నాంపల్లి శివదాస్, బొప్పు జాషువా, ఉమ్మల రాజేందర్, పోలుదాసరి రాజయ్య, రాజశేఖర్,భూపెల్లి ప్రసాద్, కాంపల్లి మారుతి,ఇందారపు రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.