18-10-2025 06:47:22 PM
వివిధ రాజకీయ పార్టీ ల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు
బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాచలం నియోజకవర్గం బంద్ సంపూర్ణంగా జరిగింది. భద్రాచలం పట్నంతో పాటు మండల కేంద్రమైన దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం వాజేడు మండల ప్రాంతాల్లో కూడా బీసీ బంద్ విజయవంతమైనది. పెద్ద ఎత్తున నిర్వహించిన బీసీ బందుకు బీసీ ఐక్యవేదిక నాయకులు సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ వివిధ కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున బందులో పాల్గొని ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిజెపి, తెలుగుదేశం నాయకులు వేర్వేరుగా బందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు పట్టణంలో తిరుగుతూ షాపులు బందు చేస్తూ సహకరించాలని కోరారు. అంతేకాకుండా బస్టాండ్ నుండి బస్సులు బయటకు రాకుండా ఇన్ గెట్, అవుట్ గేట్లు వద్ద భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు మోహరించారు బందుకు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు స్వయంగా పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భద్రాచలంలో జరిగిన బందుకు కాంగ్రెస్ పార్టీ నుండి పరిమి శ్రీనివాస్ బుడగం శ్రీనివాస్, వెంకటరెడ్డి, నరేష్, కోటేష్ టీవీ వెంకటేశ్వర్లు, సిపిఎం నుండి గడ్డం స్వామి బాల నర్సారెడ్డి సిపిఐ నుండి రావులపల్లి రవికుమార్, కల్లూరు వెంకటేశ్వరరావు మాస్ లైన్ పార్టీ నుండి చర్చల రంగారెడ్డితో పాటు పలువురు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే వేరువేరుగా నిర్వహించిన బందులో బిజెపి నుండి కొంచెం ధర్మ రామ్మోహన్ రావు తెలుగుదేశం నుండి కిట్టి బాబు పాల్గొనగా టిఆర్ఎస్ పార్టీ నుండి నిర్వహించిన బందుకు రావులపల్లి రాంప్రసాద్ రామకృష్ణ సునీల్ తదితరులు పాల్గొన్నారు.