calender_icon.png 18 October, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐకి పత్తిని విక్రయించే విధానంపై రైతులకు అవగాహన

18-10-2025 06:41:33 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని అంకుశం, దుగినపల్లి, రంగపేట గ్రామాల రైతులకు సీసీఐకి పత్తి విక్రయించే కొత్త విధానంపై వ్యవసాయ అధికారులు శనివారం అవగాహన కల్పించారు. అంకుశం గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఏఈఓ తిరుపతి, దుగ్ననపల్లి, రంగపేట గ్రామాల్లో ఏడిఏ రాజ నరేందర్, ఏవో ప్రేమ్ కుమార్, ఏఈఓ శ్రీనివాస్ తో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. (KAPAAS KISAN) ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.

పట్టా పాస్బుక్ కలిగిన రైతుల వివరాలు ఆన్లైన్లో పంట నమోదు చేసి ఉందన్నారు. రైతుల కేవలం పత్తి అమ్మడానికి స్లాట్ బుక్కు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. కౌలు రైతులు స్లాట్ బుక్ చేసిన వెంటనే పట్టాదారునికి ఓటిపి వెళ్తుందని, ఓటిపి చెబితే ఏఈఓ లు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. తరువాత కౌలు రైతు తనకు తానుగా స్లాట్ బుక్ చేసుకుని పత్తి పంటను సీసీఐకి అమ్ముకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ ఏఈఓ లను సంప్రదించాలని కోరారు.