calender_icon.png 18 October, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాడీ బిల్డింగ్ లో పతకాలు సాధించిన సింగరేణి కార్మికులు

18-10-2025 06:43:35 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈనెల 14 నుండి 16 వరకు జరిగిన కోల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలలో సింగరేణి కార్మికులు పతకాలు సాధించారు. 75 కిలోల విభాగంలో జనగామ మొగిలి రజత పతకం సాధించగా, పెసరి అర్జున్ 70 కిలోల విభాగంలో కంచు పతకం సాధించారు. వీరు పతకాలు సాధించడంతో బెల్లంపల్లి స్కై జిమ్ నిర్వాహకులు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.