18-10-2025 06:52:32 PM
చొప్పదండి (విజయక్రాంతి): ప్రాథమిక పాఠశాల రాగంపేటలో 5వ తరగతిలో చదువుతున్న దీకొండ స్వాద్విన్ తండ్రి అశోక్ అనారోగ్య కారణాలతో మరణించగా తల్లి, నానమ్మ, తాతయ్య ఇది వరకే చనిపోయినందున అనాథగా మారాడు. రాగంపేట జడ్.పి.హెచ్.ఎస్ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 12500 రూపాయలను విద్యార్థికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు దినకర్, ఉపాధ్యాయులు కర్ర వెంకటరాం రెడ్డి, గంగేశం, శ్రీనివాస్, నర్సయ్య, రజియోద్దీన్, రాజకుమార్, యుగేందర్, శంకరయ్య, వీరేశం, తదితరులు పాల్గొన్నారు.