18-10-2025 12:21:00 AM
రాజకీయ పార్టీలు సహకరించాలి
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లబోయిన అశోక్
వరంగల్, అక్టోబర్ 17(విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం జరగనున్న బీసీ బం ద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లబోయిన అశోక్ ముదిరాజ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ కార్యాలయంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు భయ్యా స్వామి ముదిరాజ్ మరియు అర్బన్ జిల్లాకార్యదర్శి పులి రజనీకాంత్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి అశోక్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేదాకా మనం అందరం కలిసి కొట్లాడలన్నారు. రాబోయే రోజుల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే వరకు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.
అదేవిధంగా వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పౌర సమాజం, పెట్రోల్ బంకులు ,ఆటో కార్మికులు, చిరు వ్యాపారులు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా శాంతియుతంగా పాల్గొని బంద్‌ను దిగ్విజయం చేయా లని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్, వరంగల్ జిల్లా చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య ముదిరాజ్, అర్బన్ కార్యదర్శి పుట్ట మహేందర్, వీర్ల నరేశ్, సాదినేని సుధాకర్, జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడు, ముదిరాజ్ గోనెల అనురాధ ముదిరాజ్ తదిత రులు పాల్గొన్నారు.