18-10-2025 06:41:46 PM
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శనివారం నియామక పత్రాల అందజేత కార్యక్రమం శిల్పకళవేదికలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సీఎస్, డీజీపీ హాజరయ్యారు. గ్రూప్-2 విజేతలతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆహ్వానం అందింది. మొత్తం 16 శాఖల్లో 18 రకాల పోస్టులకు సంబంధించిన 782 మంది గ్రూప్-2 ఉద్యోగాలకు సీఎం రేవంత్ చేతుల మీదగా నియామకపత్రాలు అందజేస్తారు. 783 గ్రూప్-2 ఉద్యోగాల కోసం 2022లో టీజీపీఎస్సీ నోటీఫికేషన్ జారీ చేయగా, గతేడాది డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించింది. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 783 పోస్టులకు గాను 782 మంది ఎంపికయ్యారు. మిగిలిన ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదు.