calender_icon.png 18 October, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుకర్ హంతకులను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి

18-10-2025 12:22:00 AM

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్

బెల్లంపల్లి అర్బన్: భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైనా మాజీ జడ్పీటిసి రుద్రభట్ల సంతోష్ కుమార్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుకర్ కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం రూ.25 లక్షల  నష్టపరిహారం అందించాలన్నారు.

స్థానిక ఎంఎల్ఏ గడ్డం వినోద్ హంతకులకు తన ఫామ్ హౌస్ లో దాచి పెట్టి రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎంఎల్ఏ అయి ఉండి బాధితులను పరామర్శించక పోవడం శోచనీయం అన్నారు. మధుకర్ చనిపోయి ఎనిమిది రోజులైనా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అరోపించారు.

ఆత్మహత్యకు కారకులైన ఎస్ఐ కోటేశ్వర్ ను కాపాడడానికి బాధితుల  కంప్లైంట్ కూడా పోలీసులు తీసుకోలేదన్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని, లేకుంటే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, సీనియర్ నాయకులు గోవర్ధన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు, శ్రవణ్ కుమార్, ఎస్సీ మోరచ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి నవీన్ కుమార్, ఎస్సీ మోరచ జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింగ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అరవింద్ పాల్గొన్నారు.