17 June, 2026 | 11:07 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

బీసీ బంద్ విజయవంతం

18-10-2025 08:42 PM

- మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు.

- 42% రిజర్వేషన్ పొందే వరకు ఉద్యమిస్తాం  అంటున్న బీసీ నాయకులు..

- మేమెంత...? మాకెంత...? అంటు నినాదాలు.

- ధమాషా పద్ధతిన రిజర్వేషన్లు ప్రకటించాలి.

శంకర్ పల్లి: 42 శాతం రిజర్వేషన్లకై బీసీ నాయకులు చేస్తున్న రాష్ట్ర బంద్ విజయవంతం అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందున ఆర్ కృష్ణయ్య, బీసీ నాయకులు ఒకరోజు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు శంకర్పల్లి మండలంలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో  బందు విజయవంతం అయ్యింది. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బందుకు మద్దతు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యమిస్తామని బీసీ నాయకులు గొంతెత్తి చాటారు. దామాషా పద్ధతిన మేము ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్ పెంచితే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా పోరాడి బీసీ ఉద్యమాన్ని మరింత  ముందుకు తీసుకెళ్తామని రిజర్వేషన్ సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని బీసీ నాయకులు తెలిపారు.