18-10-2025 08:38:34 PM
కోనరావుపేట(విజయక్రాంతి): కోనరావుపేట సింగిల్ విండో డైరెక్టర్ గజ్జల ఆనందం(50) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. కోనరావుపేట సింగిల్ విండో డైరెక్టర్ గా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జల ఆనందం ఎన్నిక కాగా ఆయన నివాసంలో శనివారం రోజు హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య సుజాత ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.
కాగా ఒకే సంవత్సరంలో ముగ్గురు సింగిల్ విండో డైరెక్టర్లు మృతి చెందడం చర్చినీయంశంగా మారింది. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పల్లం సత్తయ్య, శివంగాళపల్లి గ్రామానికి చెందిన బాల్ రెడ్డి,గర్జనపల్లి గ్రామానికి చెందిన ఆనందం మృతి చెందడంతో కోనరావుపేట సింగిల్ విండోలో ముగ్గురు డైరెక్టర్లను కోల్పోయింది. ఒకే సంవత్సరంలో ముగ్గురు డైరెక్టర్లును కోల్పోవడంతో సింగల్ విండో రైతులు పాలకవర్గం ఆవేదన వ్యక్తం చేశారు.