calender_icon.png 21 October, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కపట ప్రేమ

18-10-2025 08:42:31 PM

రామగుండంలో బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ 

రామగుండం,(విజయక్రాంతి): బిసిల పట్ల బిజెపి, బీఆర్ ఎస్ పార్టీల కపట ప్రేమని,  రామగుండం నియోజకవర్గం లోని గోదావరిఖని చౌరస్తా లో నిర్వహించిన తెలంగాణ బీసీ బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్నారు. శనివారం గోదావరి ఖని చౌరస్తాలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ... బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో అవకాశాలు పెరగాలని, బీసీ కుల గణన నిర్వహించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.  

బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నినాదంగా పెట్టుకుందని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆముదానికి పంపితే తగిన స్పందన రాలేదని తెలిపారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేదెందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుండి ఫలితం శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల పెంపు పట్ల ఇష్టం లేదన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బిల్లు ఆముదానికి గవర్నర్ ను ఒప్పించలేకపోతున్నారని, బిజెపి తీరు ఇలా ఉండగా గతంలో స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 23 శాతానికి బిఆర్ఎస్ పార్టీ దక్కించిందని, ప్రస్తుతం ఈ రెండు పార్టీలు బీసీల పట్ల చూపుతున్న కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారని, ఈ అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన తెలంగాణ బీసీ బంద్ ను కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నదని తెలిపారు.