calender_icon.png 18 October, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జంకిలో బంద్ విజయవంతం

18-10-2025 04:05:25 PM

- అన్ని పార్టీ లు ఒక వైపు కాంగ్రెస్ ఒక వైపు .

- పోలీస్ సిబ్బంది తో భారీ బందోబస్తు 

బెజ్జంకి: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వడంతో శనివారం  బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ,సిపిఐ,సిపిఎం,బీఎస్పీ,ఎంఆర్పిస్, బిఆర్ ఏస్ పార్టీ ,బీసీ సంఘాల నాయకులు, డీఎస్పీ పార్టీలు, అన్ని బంద్ లో పాల్గొనగా కాంగ్రెస్ సింగిల్ పాల్గొని బంద్ విజయవంతం చేశారు. శనివారం ఉదయం నుంచి అన్ని పార్టీ ల నాయకులు బంద్‌ను విజయవంతం చేసేందుకు వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ సౌజన్య పోలీసులు సిబ్బంది తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలలో ఆశ్రయించారు.