calender_icon.png 18 October, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి అభిప్రాయాల తర్వాతే డిసిసి అధ్యక్షుని ఎన్నిక

18-10-2025 04:10:02 PM

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి ఎన్నికపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఐసిసి పరిశీలకులు కర్ణాటక రాష్ట్ర హంగళ్ నియోజకవర్గ శాసనసభ్యులు మానే శ్రీనివాస్, ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, అత్రం సుగుణ, మ్యాడమ్ బాలకృష్ణ, గ్రంథాలయం చైర్మన్ సత్తు మల్లేశం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చామల  మాట్లాడుతూ... జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎంపిక ఉంటుందన్నారు.