12-07-2024 02:52:07 AM
ఎంపీ అసదుద్దీన్‌కు ఆర్. కృష్ణయ్య వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు మద్దతివ్వాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. గురువారం దారుసలాంలో ఈ మేరకు ఒవైసీతో కృష్ణయ్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు వివిధ రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన హక్కులు అందడం లేదన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకోసం ఎంఐఎం పార్టీ చొరవ తీసుకోవాలని, పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టాలని కోరారు. ఈ ప్రతిపాదనకు అసదుద్దీన్ సానుకూలంగా స్పందించారని కృష్ణయ్య చెప్పారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, అనంతయ్య, రాజేందర్, కోలా జనార్ధన్, శివతో పాటు తదితరులు పాల్గొన్నారు.