calender_icon.png 18 July, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం సహకారంతో ఆర్‌వో బ్రిడ్జిలను నిర్మిస్తాం

12-07-2024 02:53:01 AM

ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే ఓవర్(ఆర్‌వో) బ్రిడ్జిలను నిర్మిస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని బొల్లారం, అల్వాల్, సుచిత్ర, సఫిల్‌గూడ, ఆనంద్‌బాగ్, ఉప్పర్‌గూడ, గౌతంనగర్‌లో పలు రైల్వే స్టేషన్లు, అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలను రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్‌వో బ్రిడ్జిలను కేంద్రం మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే ఆగిపోయాయని ఆరోపించారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు సుబ్రహ్మణ్యం, రామారావు, శ్రీనివాస్, నాయకులు విక్రమ్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.