21-11-2025 03:29:20 PM
తాండూరు,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించిన తర్వాతే సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని , పార్టీలపరంగా రిజర్వేషన్లు నిర్ణయించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్-కలెక్టర్ కార్యాలయాన్ని బీసీ సంఘం మరియు బీసీ జేఏసీ నాయకులు ముట్టడించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు 42% చట్టబద్ధత కల్పించకుండానే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం అన్యాయం అని అన్నారు, సర్పంచ్ ఎన్నికలు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం, అలాగే కేంద్రం నుండి నిధులు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడం బీసీలను మభ్యపెట్టే రాజకీయ మాటలు తప్ప మరేమీ కావని విమర్శించారు, ఇంకా ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు, యువకులు, మహిళలు భారీగా పాల్గొన్నారు.