21-11-2025 03:19:24 PM
బెజ్జూర్, (విజయ క్రాంతి):బెజ్జూర్ మండలంలోని కుకిడ పంట పొలాల్లో బారి కొండచిలువ కూలీలకు కనిపించడంతో కూలీలు పరుగులు పెట్టారు. ఇట్టి విషయం పొలం యజమానికి తెలపడంతో అక్కడికి చేరుకొని భారీ కొండచిలువను పట్టుకునేందుకు మరి కొంతమంది యువకులు వచ్చి పట్టుకొని బయట ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. ఉదయం సమయంలో పాములు, కొండచిలువలు వరి కుప్పలలో ఉండే ప్రమాదం ఉందని తెల్లవారుజామున పంట పొలాలకు వెళ్లకూడదని రైతులు తెలుపుతున్నారు.