21-11-2025 03:20:47 PM
లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ విద్యను అందించాలని లక్ష్యంతో సేవా భారతి గ్లోబల్ డాటా సహకారంతో పేద విద్యార్థులకు కంప్యూటర్ ల్యాప్ టాప్ లను అందిస్తున్నామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ రావు పేర్కొన్నారు. శుక్ర వారం లక్షెట్టిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు ల్యాప్ టాప్ ల అందజేత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
12 ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ ల్యాబ్ కంప్యూటర్లకు సంబంధించి ల్యాబ్ ప్టాప్, టీచర్ ను ఏర్పాటు చేసి బేసిక్ కంప్యూటర్ విద్య నేర్పాలనే ఉద్దేశంతో ఈ సేవా భారతి ఆధ్వర్యంలో గ్లోబల్ డాటా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాల్ రావు, మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి మంద రాజేందర్, మాజీ జెడ్పిటిసి ముత్తే సత్తయ్య, సీనియర్ నాయకులు ముఖేష్ గౌడ్, నరేష్ చంద్ జైన్ , గుండ ప్రభాకర్, వేముల మధు, రాజమౌళి, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.