21-11-2025 03:17:45 PM
తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి
తాడ్వాయి,(విజయక్రాంతి): రైతులు తాము పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మవద్దని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి రైతులకు సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ,ఏండ్రియాల్ గ్రామాలలో ఆయన శుక్రవారం వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని వెంట వెంటనే తూకం వేయాలని అధికారులను కోరారు. రైతులకు హామాలి, ట్రాన్స్పోర్ట్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెంట వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు పీసు రాజిరెడ్డి, సంజీవరెడ్డి, గణేష్ నాయకులు చిన్నోళ్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.