calender_icon.png 21 November, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షెట్టిపేటలో సామూహిక వందేమాతర గీతం...

21-11-2025 03:14:47 PM

లక్షెట్టి పేటటౌన్,(విజయక్రాంతి): వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని గాంధీ చౌక్ లో  వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ప్రజలతో కలిసి సామూహిక వందే మాతర గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరిని ఏకతాటిపై తీసుకువచ్చిన గీతం వందేమాతర గీతం అని అన్నారు. బంకీం చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గేయం స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరిలోనూ పోరాటస్ఫూర్తిని రగిలించిందన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తలుచుకుంటున్నామని, వారి త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాల్ రావు, మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ముత్తె సత్తయ్య, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్,  పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి మంద రాజేందర్, సీనియర్ నాయకులు నరేష్ చంద్ జైన్, గుండ ప్రభాకర్, రాజ గురువయ్య, కానుగంటి మల్లయ్య, పాంచాల రమేష్,  రాజమౌళి, కార్యకర్తలు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.