09-08-2025 03:06:12 AM
గోవా గవర్నర్‌కు బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్, కేసన శంకర్‌రావు విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బీసీ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ర్ట అధ్యక్షు డు కేసన శంకరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గోవా రాజ్ భవన్‌లో నూతన గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతిరాజును బీసీ సంఘాల నేతలు మర్యాదపూ ర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్‌ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి, బీసీ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని వారికి అందజేశారు. ఈ సంద ర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌రావు మాట్లాడుతూ.. 2026 నుంచి దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో సమగ్ర కులగణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దేశంలోని బీసీలంతా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.
బీసీలకు చట్టసభలో జనాభా దామషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల కల్ప న, మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోటా, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెం చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని అశోక్ గజపతిరాజును కోరారు.
బీసీ సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి, బీసీ డిమాండ్ల పరిష్కా రానికి తనవంతు కృషి చేస్తానని గోవా గవర్నర్ హామీ ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వా రిలో కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం కురుమ, నరేశ్ ప్రజాపతి, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, బాలగుండ్ల శ్రీని వాసరావు, పూర్ణ, కాశి, హనుమంతరావు, వేముల కృష్ణ, వెంకటరావు, సతీశ్ ఉన్నారు.