09-08-2025 03:05:59 AM
వారసిగూడ ఆగష్టు 8 (విజయక్రాంతి): నిరుపేదల వైద్య సేవలకు సహకారం .పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ లోని మాణికేశ్వరి నగర్ కు చెందిన కోడాది పర్నిక, ఏ.సీ.ఎస్. నగర్ కు చెందిన కే.సుధాకర్ లు అనారోగ్యంతో సతమతమవుతున్న దశలో సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ) పత్రాలను సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందించారు.
కార్యక్రమంలో సమన్వయకర్త రాజ సుందర్, పరికిబండ మాజీ సర్పం అర్జున్, మనోహరాబాద్ ఎం.పీ.టీ.సీ. వెంకటేష్ గౌడ్, శేఖర్ గౌడ్, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.