09-08-2025 03:07:02 AM
నేరేడ్ మెట్, ఆగస్టు 8 : భార త బ్యాడ్మింటన్ అభిమానులకు గర్వకారణంగా, చదరం హంసిని శ్రీలంక జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ 2025లో గర్ల్స్ సింగి ల్స్ యూ15 టైటిల్‌ను గెలుచుకుంది. ఆగస్టు 5 నుంచి 8 వరకు కొలంబోలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆమె ఈ విజయం సాధించింది. ఇది హంసినికి మొదటి అంతర్జాతీయ విజయం కావడం విశేషం. ఈ విజయం ఆమె ప్రతిభను, పట్టుదలని, కృషిని ప్రతిబింబిస్తోంది.
ప్రస్తుతం హంసిని భాస్కర్ బాబు సారధ్యంలో భాస్కర్ బాబు ఆర్3 బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని బీబీబీఏ, ఆర్3 మేనేజ్‌మెంట్ ఆమెను హృదయపూర్వకంగా అభినందించాయి. అంతర్జాతీ య స్థాయిలో పతకం సాధించి దేశానికి గౌరవం తీసుకురావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆమె శిక్షణా సంస్థకు గౌరవం తీసుకురావడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తుంది. ఎంతో ఉన్నత లక్ష్యాలవైపు దూసుకెళ్లాల ని, కష్టపడి సాధించాలని ఈ విజయ గాథ చాటి చెబుతోంది.