1 September, 2026 | 11:06 PM

Breaking News

అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •  

కర్ణాటక సీఎంతో బీసీ నేతల భేటీ

14-07-2026 | 12:44am

ఆగస్టు 7న బెంగళూరులో ఓబీసీ మహాసభకు ఆహ్వానించిన జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఆగస్టు ఏడో తేదీన బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీలోని ఆడిటోరియమ్‌లో జరగనున్న అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం సోమవారం బెంగళూరులోని కృష్ణ హౌస్‌లో కలిసి ఆహ్వానించారు.

బెంగళూరు పట్టణంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు బికే హరి ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ప్రొఫెసర్ బాబన్ రావు తైవాడే (మహారాష్ట్ర), కేస న శంకర్ రావు (ఆంధ్రప్రదేశ్), లక్ష్మణ్ (కర్ణాటక), కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ (తెలం గాణ) 15 మంది ఓబీసీ ప్రతినిధులు సీఎం డీకే శివకుమార్‌తో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై సుమారు 20 నిమిషాలు బిసి ప్రతినిధులతో సీఎం డీకే శివకుమార్ చర్చించారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణనలో ఓబీసీ కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం లెక్కించడం లేదని, మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోతే ఓబీసీ మహిళలు చట్టసభలను అడుగుపెట్టలేరని, దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని ఓబీసీలకు మాత్రమే జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు దక్కడం లేదని, కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని, బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయంపై బీసీ సంఘాలుగా తాము దేశవ్యాప్తంగా పోరాడుతున్నా మని, దేశవ్యాప్తంగా జరిగే పోరాటానికి , బీసీ డిమాండ్‌ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం తరఫున చొరవ తీసుకోవాలని సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు.

జాతీయస్థాయిలో ఓబీసీలను ఏకం చేయడానికి దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా జాతీయ ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, నాగపూర్, హైదరాబాద్, తిరుపతి, అమృత్సర్, గోవా, హర్యా నా తదితర రాష్ట్రాలలో మహాసభలు చారిత్రాత్మకంగా నిర్వహించామని, 11వ జాతీయ ఓబీసీ మహాసభను ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నామని ఈ మహాస భకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని సీఎం డీకే శివకుమార్‌ను కోరారు. బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున తన వంతు కృషి చేస్తానని, తప్పకుండా ఈ మహాసభకు హాజరవుతానని సీఎం హామీ ఇచ్చినట్లు జాజుల తెలిపారు. సీఎంను కలిసిన వారిలో బిసి నేతలు ఉన్నారు.