calender_icon.png 31 July, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలి

30-07-2025 01:26:09 AM

  1. లేకపోతే బీజేపీ హటావో, బీసీ రిజర్వేషన్ బచావో పేరుతో ఉద్యమం
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు: జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకపోతే బీజేపీ హటావో, బీసీ రిజర్వేషన్ బచావో పేరుతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించ కపోతే బీహార్, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని, తెలంగాణలో జరిగే ఉపఎ న్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్తామని పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్లు పెంచడానికి బీజేపీనే అడ్డంకిగా మారిందని, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు అవాకులు చివాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం మీడి యా పాయింట్‌లో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై హస్తినకు ప్రభుత్వం తరఫున పోరుబాట పట్టాలని  నిర్ణయించడం సరైన నిర్ణయమే,

బీసీ సంఘాలు చేసిన సూచనతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మూడు రోజుల పాటు ఆం దోళనలు చేపట్టాలని నిర్ణయించడం మంచి పరిణామన్నారు. రాష్ర్టంలో జరిగిన కులగణన రాజ్యాంగబద్ధంగా నిర్వహించలేదని బీజేపీ నేత రాంచందర్‌రావు మాట్లాడటం సరికాదన్నారు. ముస్లింల సాకు చూపించి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బండి సంజయ్ మాట్లాడటం బీసీ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని ధ్వజమెత్తారు.