30-07-2025 01:25:09 AM
- పామ్ ఆయిల్ మెగా ప్లాంటేషన్ లో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- కాంగ్రెస్ ప్రభుత్వం లో నే రైతులకు మేలు
వికారాబాద్, జూలై 29: పామ్ ఆయిల్ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులతో ఆర్థికంగా బలపడాలని రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు.మంగళవారం వికారాబాద్ ప రిసర ప్రాంతంలోని కొత్రేపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మె గా ఆయిల్ ఫామ్ ప్లాటేషన్ డ్రైవ్ లో భాగం గా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని మొక్కలు నాటా రు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరావు మా ట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి రైతులను ఆదుకునే దిశగా పనిచేస్తుందన్నారు. పామ్ ఆయిల్ పంట సాగుతో అధిక లాభాలు ఆర్జించడంతో పాటు మూడు సం వత్సరాల పాటు అంతర్గత కూరగాయ పం టలతో వ్యవసాయం సాగు చేయవచ్చునని మంత్రి తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తూ రైతులను ప్రో త్సహించడం జరుగుతుందన్నారు.
రైతులకు మొక్కలు ఇవ్వడంతో పాటు డ్రిప్ పరికరాల ను అందించే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయిల్ ఫామ్ పంటలను సా గు చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని అదేవిధంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేసుకునే విధంగా అవగాహ న కల్పించాలని ఆయన తెలిపారు. శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లా డుతూ....తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధికంగా ప్రాముఖ్యత నిస్తూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.
ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోనే వ్యవసాయ రంగం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని, రైతులను రుణ బారం నుండి విముక్తులను చేయడానికి 25 లక్షల మంది రైతులకు చెందిన 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేయడం జరిగిందని సభాపతి తెలిపారు.మన వికారాబాద్ జిల్లాలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయని, ఆ యిల్ ఫాం పంటకు అనుకూలంగా ఉంటాయని ఆయన తెలిపారు. వరి పంటకు అవ సరమైన ఒక్క ఎకరం నీటితో నాలుగు ఎకరాల ఆయిల్ ఫాం తోటలను సాగు చేయవ చ్చని,నాటిన మొదటి నాలుగు సంవత్సరా లు 50 వేల 918 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్ళ పాలనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని,ప్రాణహిత- చేవెళ్ల మరియు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులకు నిధులు ఇవ్వలేదని అన్నా రు. ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా వచ్చే అయిదేళ్ళలో మన ప్రాంతానికి సాగు నీరు తెస్తానని సభాపతి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ హ ష్మీన్ భాష, డిప్యూటీ డైరెక్టర్ నీరజ గాంధీ , అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌పాల్గొన్నారు.