30-07-2025 01:28:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదాయపు పన్ను ఐటీ శాఖ మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. ఆదూరి గ్రూపు ఇన్ఫ్రా కార్యాలయంలో మంగళవారం సో దాలు నిర్వహించింది. మంగళవారం ఉద యం నుంచి కేపీహెచ్‌బీలోని ఆదూరి గ్రూపు ఇన్ఫ్రా కార్యాలయంపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ తనిఖీలు కొనసాగాయి. ఐటీ అధికారులు ఆదూరి గ్రూపు ఇన్ఫ్రా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కేపీహెచ్‌బీలోని ప్రధాన కార్యాల యంతో పాటు, సంస్థ యజమానుల బం ధువులు, సంబంధీకుల నివాసాలు, కార్యాలయాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేతలు, అక్రమ ఆస్తు ల కూడబెట్టడం వంటి ఆరోపణల నేపథ్యం లో ఈ దాడులు జరిగిన్నట్లు సమాచారం.