06-08-2025 12:02:16 AM
ఎల్బీనగర్, ఆగస్టు 5 : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చేస్తు న్న బీసీ ఉద్యమానికి సకలజనులు మద్దతు ఇవ్వాలని బీసీ హక్కుల సాధన సమితి వి జ్ఞప్తి చేసింది. న్యూనాగోల్ లోని ఎస్‌ఏ డాం గే భవన్ ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఆఫీస్ బేరర్ దిటి న ర్సయ్య, బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ... ప్ర త్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకలజనులు ఎలాగైతే ఐక్యమై పోరాటం నిర్వ హించారో అదేవిధంగా బీసీల న్యాయమైన రాజకీయ వాటా కోసం చేస్తున్న ఉద్యమానికి సకలజనులు మద్దతు ఇవ్వాలన్నారు.
ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి వెన్నుముకగా నిలిచి ముం దుకు నడిపించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అడ్డంకిగా ఉన్న రాజకీయ పా ర్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమాన్ని అడ్డగా పెట్టుకుని అనేక పదవులు పొందినవారు తమ చిత్తశుద్ధిని చాటు కోవాలని కోరారు. సమావేశంలో బీసీ నా యకులు బాతరాజు నర్సింహ, పల్లె రమేశ్ గౌడ్, పందిరి మడేలు పాల్గొన్నారు.