calender_icon.png 6 August, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్వాల నియోజకవర్గంలో ఘనంగా ఇందిరా మహిళ శక్తి సంబురాలు

06-08-2025 12:02:46 AM

గద్వాల, ఆగస్టు 05 : మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తున్నట్లు గద్వాల శాస నసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

మంగళవారం గద్వాల పట్టణంలోని అనంత ఫం క్షన్ హాల్ నందు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు.

ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గం అభివృద్ధి కోసం 3500 ఇద్దరమ్మా గృహాలను మహిళల పేరున మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. సం క్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా నిరుపేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించి, రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం జరిగిందని గుర్తు చే శారు.

మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి బస్సులకు యజమానులు చేసి ఉపాధి కల్పిస్తున్నామని, అంతేగాక పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆదాయం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి దశలవారీగా సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందని ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

ఈ సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాల చెక్కు, వడ్డీ లేని రుణాల చెక్కు, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.