calender_icon.png 15 September, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించాలి

15-09-2025 03:34:05 PM

మందమర్రి (విజయక్రాంతి): బాలికల ఉన్నత విద్యను దృష్టిలో పెట్టుకొని బీసీ బాలికల వసతి గృహాన్ని అన్ని మండలల్లో వెంటనే ఏర్పాటు చేసి విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆకారం రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలు కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహం గత రెండు సంవత్సరాల క్రితం అనివార్య కారణాల వలన మూసివేశారన్నారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దూర ప్రాంతాల నుండి వచ్చి చదువు తున్న విద్యార్థినులు హాస్టల్ సౌకర్యం సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అంతేకాకుండా అనేక మంది నిరుపేద విద్యార్థినులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వసతి గృహం ఏర్పాటు చేసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా లని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సట్ల సంతోష్, పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పకుర్తి శశిధర్ లు పాల్గొన్నారు.