calender_icon.png 15 September, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

15-09-2025 03:30:35 PM

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, ఒంటరి మహిళల పింఛన్లు వెంటనే పెంచాలని ఎమ్మార్పీఎస్(MRPS) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, విహెచ్పీఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో దివ్యాంగుల ఫించన్ 4వేల నుండి 6వేలకు, వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళల ఫించన్లు 2 వేల నుండి 4 వేలకు పెంచుతామ ని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల డిప్యూటీ తహసీల్దార్ సంతోష్ కు అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ జీడి సారంగం మాదిగ, విహె చ్పిఎస్ పట్టణ అధ్యక్షులు రామ్ శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్  మండల అధ్యక్షులు అసంపల్లి శివకుమార్ మాదిగ, పట్టణ అధ్యక్షులు చిలుముల రాజ్ కుమార్ మాదిగ, క్యాతనపల్లి పట్టణ అధ్యక్షులు రాచర్ల నరేష్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు ఆసంపల్లి అనిల్ కుమార్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి తైదల జంపన్న మాదిగ, మండల కార్యదర్శి అఖిల్ మాదిగ, సీనియర్ నాయకులు అయిందాల సది మాదిగ, రత్నం మొగిలి మాదిగ, వేల్పుల రాజారాం మాదిగ,లు పాల్గొన్నారు.