14-07-2025 10:29:21 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా నిర్మిస్తున్న బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహం పనులను వేగవంతం చేసి త్వరగా ప్రారంభించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre)కు వినతి పత్రం అందజేయడంతో బీసీ సంక్షేమ శాఖ అధికారిని భవన పనులపై పూర్తి నివేదిక తయారు చేసి అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం దినకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2.9 కోట్ల రూపాయలతో భవనం నిర్మాణం చేపట్టగా చివరి దశకు చేరుకున్నాయని ఫ్లోరింగ్, ప్లంబింగ్, విద్యుత్ పనులు మిగిలి ఉన్నాయని వాటిని వెంటనే పూర్తిచేసి జనకాపూర్ లో అద్దె భవనంలో కొనసాగుతున్న బీసీ బాలికల పోస్ట్మెట్రిక్ వసతి గృహాన్ని వెంటనే తరలించాలన్నారు.