calender_icon.png 15 July, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్లూరు ఎల్లారెడ్డిని సందర్శించిన సివిల్ సప్లై అధికారులు

14-07-2025 10:22:47 PM

గోదాం యజమానిపై సీరియస్..

వెంటనే పురుగుల నివారణ చేపట్టాలని ఆదేశం..

లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించిన అధికారులు..

కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) ఆదేశాలతో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రాజేందర్, జిల్లా పంచాయతీ అధికారి మురళి కామారెడ్డి జిల్లా సదాశినల్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాన్ని సోమవారం సాయంత్రం సందర్శించారు. గోదాముల యజమాని నరేందర్ రెడ్డిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. గోదాంలలో శుభ్రత పాటించకుండా పురుగులు వచ్చేలా ఎందుకు చూశారని గ్రామస్తులంతా పురుగులతో అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు చెప్పిన పట్టించుకోకపోవడం ఏమిటి అని హెచ్చరించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రాజేందర్ తెలిపారు. వెంటనే పురుగుల నివారణ చేపట్టాలని పిచికారి చేసి నివారించాలని సూచించారు.

గోదాములలో శుభ్రత పాటించకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్కు పూర్తి నివేదిక అందజేస్తామని రాజేందర్ తెలిపారు. గ్రామస్తులు చేరుకొని పురుగులు పారుతున్న విషయాలను వివరించారు. గోదాముల యజమానుల నిర్లక్ష్యం వల్లే ఇలా పురుగులు గ్రామంలో వ్యాపించాయని రోడ్డుపై నడిచి వెళ్లినా కూడా బైక్ పై వెళ్లినా కూడా పురుగులు వచ్చి వాలుతున్నాయని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. వెంటనే పురుగుల నివారణ చేపట్టాలని గోదాం యజమానులకు సూచించారు. రెండు రోజులపాటు గ్రామం మొత్తం పిచ్చికారి చేస్తేనే పురుగుల బెడద నివారణ జరుగుతుందని గ్రామస్తులు అధికారులకు తెలిపారు.