calender_icon.png 15 July, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు

14-07-2025 10:31:12 PM

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ధర్మశాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం కన్యకా పరమేశ్వరి వాసవి మాత శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాఖంబరి అలంకరణ, గోరింటాకు సమర్పణ, సామూహిక వాసవి పారాయణం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతో అందరూ బాగుండాలని వాసవి మాత ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. వాసవి మాత చూపిన బాటలో అందరు నడవాలని ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని దైవ నామస్మరణతో మానవ జీవితానికి ముక్తి కలుగుతున్నన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.