04-11-2025 01:22:06 PM
							ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం పిలుపు
ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఆందోళన.. పాల్గొన్న మాజీ మంత్రి
హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం(BC Student Union) పిలుపునిచ్చింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు(Fee reimbursement dues) తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఆందోళనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలలో(Private higher education institutions) ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, నర్సింగ్, మొదలగు కోర్సులలో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ కౌన్సిలర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన దీక్షలో పాల్గొనడం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలకు పెండింగ్ లో ఉన్న ఫీజును విడుదల చేయాలని, లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలిని శ్రీనివాస్ గౌడ్ కోరారు.