calender_icon.png 4 November, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూసుఫ్‌గూడలో మంత్రి పొన్నం డోర్ టూ డోర్ ప్రచారం

04-11-2025 01:46:02 PM

జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసే బాధ్యత సీఎందే: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Congress Party candidate Naveen Yadav)కు మద్దతుగా యూసుఫ్ గూడా డివిజన్ లోని ఐలంకాలనీలో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ యూసుఫ్ గూడా జైన్ మందిర్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం జైనులతో సమావేశమై, జైనుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మధురానగర్ లో మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డితే అన్నారు. అభివృద్ధి పనులతో ఈ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ దేననిని మంత్రి జోస్యం చెప్పారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వాకటి హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.