04-11-2025 12:51:22 PM
							గచ్చిబౌలి: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో(Gachibowli) డ్రగ్ పార్టీని పోలీసులు ఛేదించారు. ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్(Police Busted Drug Party ) స్వాధీనం చేసుకున్నారు. కోలివింగ్ గెస్ట్ రూంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్, ఆరుగురు వినియోగదారులు ఉన్నారని అధికారులు తెలిపారు. స్మగ్లర్ కర్నాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ నగరంలోని యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. యువకులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న గుత్తా తేజకృష్ణ, మరో నైజీరియన్ తో పాటు సాజీర్, వెన్నల రవికిరణ్, మన్నె ప్రశాంత్, పి. హర్షవర్ధన్ రెడ్డి, లోకేష్ రెడ్డి, పృథ్వి విష్ణువర్దన్, కార్లపొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున, మేకల గౌతం, గుంటక సతీష్ రెడ్డిలను ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.