15-10-2025 07:57:41 PM
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు బిసి సంఘాలు అక్టోబర్ 18న చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెలంగాణ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ బుధవారం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బిసి వర్గాల హక్కుల సాధన కోసం, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఈ బంద్ నిర్వహించడం సముచితం అన్నారు.
బిసి వర్గాలు రాష్ట్ర నిర్మాణంలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినా, ఇప్పటికీ తమకు తగిన గౌరవం, స్థానాలు లభించకపోవడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే బిసి వర్గాల సమస్యలపై దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్ అమలకు కృషి చేయాలని కోరారు. బిసి సంఘాల పోరాటానికి మేము భుజం కలుపుతున్నాము. ఈ బంద్‌ను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవంతం చేయాలని కోరుతున్నాము. అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు, వ్యాపార, వాణిజ్య,విద్య, ఉద్యోగ సంఘాలు సంఘటిత, అసంఘటిత, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.