19-08-2025 05:13:46 PM
కాగజ్‌నగర్,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం కాగజ్‌నగర్ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి ర్యాలీని ప్రారంభించి మార్కెట్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించారు.
స్థానిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన సభలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగ్యురె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.